: రైతులు దొంగలైతే.. మాల్యా డిఫాల్టరా? ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో మంగళవారం తాను నిర్వహించిన ‘ఖాట్స్ సభ’ నుంచి మంచాలు ఎత్తుకెళ్లిన రైతులను కొందరు దొంగలు అని అంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మంచాలు ఎత్తుకెళ్లిన రైతులను దొంగలన్నవారు వేల కోట్ల రూపాయలు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన మాల్యాలాంటి వారిని ‘డిఫాల్టర్’(ఎగవేతదారులు) అంటున్నారని ఆయన పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లోని షహజానీ గ్రామంలో బుధవారం ‘డోర్ టు డోర్’ ప్రచారం నిర్వహించిన సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రామ్ బచ్చన్ యాదవ్ ఇంట్లో టీ సేవించారు. తన ప్రచారం మొత్తాన్ని ప్రధానిని తూర్పారబట్టేందుకే ఉపయోగించుకున్నారు. భారతదేశానికి ప్రధాని అయిన మోదీ నిత్యం విదేశీ పర్యటనల్లో గడుపుతూ సొంతదేశ ప్రజల దుస్థితిని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News