: ప్యాకేజీ ప్రకటనపై మరో మలుపు... 'చంద్రబాబు అంగీకరిస్తేనే' అంటూ మెలిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన సందిగ్ధంలో పడింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రానికి ప్రత్యక హోదా స్థానంలో ప్యాకేజీని ఇస్తామని మీడియాకు లీకులిస్తూ వస్తున్న బీజేపీ నేతలు, ప్యాకేజీ సిద్ధమైందని, నేడు ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాను హోదాకు తప్ప ప్యాకేజీకి అంగీకరించేది లేదని చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తేల్చి చెప్పిన నేపథ్యంలో, నేడు ప్యాకేజీపై ప్రకటన ఉండక పోవచ్చన్న సంకేతాలు అందాయి. తాము ఆఫర్ చేస్తున్న ప్యాకేజీకి చంద్రబాబు ఓకే చెబితేనే దాన్ని మీడియా ముందు అధికారికంగా ప్రకటించాలని అటు అరుణ్ జైట్లీ, ఇటు అమిత్ షాలు స్పష్టం చేయడంతో, ప్యాకేజీలోని వివరాలను చంద్రబాబుకు వివరించే బాధ్యతను సుజనా చౌదరి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకటనకు చంద్రబాబు అంగీకారం తెలిపితేనే ముందడుగు వేసే ఆలోచనలో ఉన్న కేంద్రం, ఆయన ఒప్పుకోకుంటే మరిన్ని చర్చలను తెరపైకి తెచ్చే యత్నంలో ఉన్నట్టు సమాచారం.

More Telugu News