: సుప్రీం తీర్పును శిరసావహించిన కర్ణాటక!... రైతుల ఆందోళనల మధ్యే తమిళనాడుకు కావేరీ జలాల విడుదల!

తమిళనాడుతో ఏళ్లుగా కొనసాగుతున్న కావేరీ జల వివాదానికి సంబంధించి కర్ణాటక నేటి ఉదయం కీలక అడుగు వేసింది. తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం శిరసావహించింది. ఓ వైపు కన్నడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నా... సుప్రీం తీర్పే అంతిమమంటూ సిద్ధరామయ్య సర్కారు కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు నుంచి నేటి ఉదయం తమిళనాడుకు నీటి విడుదలను ప్రారంభించింది. పది రోజుల పాటు కొనసాగనున్న ఈ నీటి విడుదల ద్వారా తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరీ నీరు చేరుతుంది.

More Telugu News