: బంగ్లాదేశ్ లో 'ఆంబ్రోస్'ల కోసం వెతుకుతున్నా... ఇద్దరు ఆంబ్రోస్ లు దొరికితే ఇక జట్టుకి తిరుగుండదు!: కోచ్ కోట్నీ వాల్ష్

బంగ్లాదేశ్ లో ఆంబ్రోస్ కోసం వెతుకుతున్నానని ఆ జట్టు బౌలింగ్ కోచ్ కోట్నీ వాల్ష్ తెలిపాడు. 80వ దశకంలో కర్ట్ లీ ఆంబ్రోస్ వెస్టిండీస్ జట్టుకు వెన్నెముక. ఆరడుగులకు పైగా ఎత్తుతో భీకరాకారంతో అంతకంటే భయంకరమైన బంతులు సంధిస్తూ వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కచ్చితమైన వేగంతో లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేయాలన్నా, బౌన్సర్లతో బ్యాట్స్ మన్ వెన్నులో వణుకు పుట్టించాలన్నా ఆంబ్రోస్ బౌలింగ్ కు దిగాల్సిందే. అలాంటి ఒక్క బౌలర్ బంగ్ల్ దేశ్ జట్టుకు దొరికితే జట్టు బలం పెరుగుతుందని కోచ్ కోట్నీ వాల్ష్ అన్నాడు. తాను కోచ్ గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ జట్టుకు కనీసం ఇద్దరు ఆంబ్రోస్ లను తయారు చేయగలిగితే తన లక్ష్యం నెరవేరినట్టేనని ఆయన తెలిపాడు. బౌలింగ్ కోచ్ గా ఎంపికవుతానని ఊహించలేదని, ఇంత పెద్ద బాధ్యత తనపై పెట్టినందుకు ధన్యవాదాలని చెప్పిన వాల్ష్...జట్టు కోసం వంద శాతం కష్టపడతానని చెప్పాడు.

More Telugu News