: కలెక్టర్లతో కేసీఆర్ భేటీ వాయిదా!... మధ్యాహ్నం 2 గంటలకు పోస్ట్ పోన్!

కొత్త రాష్ట్రం తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన ప్రత్యేక సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. ముందుగా ఖరారైన మేరకు నేటి ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ కలెక్టర్లతో భేటీ కావాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వాటన్నింటినీ క్రోడీకరించి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే జిల్లాలను ఏర్పాటు చేయాలన్న తలంపుతోనే కేసీఆర్ ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రజల నుంచి అందిన వినతులను టాస్క్ ఫోర్స్ కమిటీ పరిశీలన చేసి ఓ నివేదికను రూపొందిస్తుందని, ఈ నివేదికపైనే కలెక్టర్లతో భేటీలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News