: ఒబామాను అలా అన్నందుకు చింతిస్తున్నా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డూటెర్టీ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను 'తిరుగుబోతు యువతికి పుట్టినవాడు' అంటూ అభివర్ణించి, పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డూటెర్టీ ఓ మెట్టు దిగారు. "మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు అసహనాన్ని కలిగిస్తుంటే, అలా మాట్లాడాను. అది యూఎస్ ప్రెసిడెంట్ పై వ్యక్తిగత విమర్శగా మారినందుకు చింతిస్తున్నాను" అని డూటెర్టీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఒక ప్రకటన వెలువరించారు. అంతకుముందు తనను తీవ్రంగా దూషించాడన్న కారణంతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో జరగాల్సిన సమావేశాన్ని ఒబామా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిలిప్పీన్స్ లో 2,400 మంది ప్రాణాలను బలిగొన్న క్రైమ్ వార్ పై అమెరికా అధ్యక్షుడితో తాను పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని డుటెర్టీ వ్యాఖ్యానించారు. గతంలో మనీలాలో యూఎస్ అంబాసిడర్ ను కూడా ఇదే తరహాలో విమర్శించిన డూటెర్టిపై విమర్శలు వెల్లువెత్తాయి.

More Telugu News