: చేపలు, గొర్రె మాంసమే కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్!... ఎక్కడికెళ్లినా అతడి మెనూలో ఇవి ఉండాల్సిందేనట!

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ... వన్డే, టీ20 ఫార్మాట్ లోనూ సత్తా చాటుతున్నాడు. టెస్టు మ్యాచ్ లోనూ తనదైన శైలిలో బ్యాటును ఝుళిపిస్తున్న అతడు పరుగుల వరదను పారిస్తున్నాడు. క్రికెట్ లోని ఏ ఫార్మాట్ అయినా అతడికేమీ ఇబ్బంది లేదు. ఇందుకు కారణం... ఏమాత్రం పట్టు సడలని అతడి ఫిట్ నెస్సే కారణమట. వారంలో ఐదు రోజుల పాటు తప్పనిసరిగా జిమ్ బాట పట్టే విరాట్... మిగిలిన రెండు రోజులు మాత్రం రెస్ట్ తీసుకుంటాడు. ఇక ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో ఆహారపు అలవాట్లు కూడా కీలకమే కదా. మరి ఫిట్ నెస్ కోసం విరాట్ ఏం తీసుకుంటాడు? నిన్నటిదాకా ఈ విషయం తెలియకున్నా... తాజాగా ఈ విషయాన్ని కూడా విరాట్ వెల్లడించేశాడు. చేపలు, గొర్రెపిల్ల మాంసమే తన ఫిట్ నెస్ కు కారణమని అతడు చెప్పేశాడు. ఎక్కడికెళ్లినా... ప్రతి రోజూ ఈ రెండు అతడి మెనూలో ఉండాల్సిందేనట. ఇక జంక్ ఫుడ్ ను అతడు అసలే ముట్టడట. మ్యాచ్ లు ఉన్నప్పుడు ప్రోటీన్ స్నాక్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడట. ఇక స్మోకింగ్, డ్రింకింగ్ వంటి దురలవాట్లను అతడు తన దరి చేరనీయడట.

More Telugu News