: పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిగిన జీ20 సమ్మిట్ లో పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాక్ పేరు నేరుగా ప్రస్తావించని మోదీ...దక్షిణాసియాలో ఓ దేశం ఉగ్రవాదులకు ఊతమిస్తోందని మండిపడ్డారు. ఆ దేశం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో ప్రకటనలు చేయిస్తూ, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేవలం ఆ దేశం వల్లే దక్షిణాసియా మొత్తం ఉగ్రవాదం బాధితులుగా మిగులుతోందని, దక్షిణాసియాలో ఏ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా ఆ దేశ ఉగ్రవాదుల హస్తం ఉంటోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనంతరం ఆయన చైనా పర్యటన ముగించుకుని లావోస్ బయల్దేరారు. లావోస్ లో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు.

More Telugu News