: షూటింగ్ లో కమేడియన్ పృథ్వీకి గాయాలు!... క్షేమంగానే ఉన్నానంటూ హాస్య నటుడి సందేశం!

తెలుగు చిత్రసీమ టాలీవుడ్ లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో హాస్య నటుడు పృథ్వీ గాయపడ్డాడు. షూటింగ్ లో భాగంగా రోప్ షాట్ చిత్రీకరిస్తున్న సందర్భంగా జారిపడ్డ అతడికి స్వల్ప గాయాలయ్యాయట. ప్రమాదంలో షాక్ తిన్న చిత్ర యూనిట్ పృథ్వీని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. పృథ్వీని పరీక్షించిన వైద్యులు పెద్ద గాయాలేమీ కాలేదని తేల్చారు. ప్రమాదమేమీ లేదని, పృథ్వీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే సమయంలో తనకు పెద్ద గాయాలేమీ కాలేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కూడా పృథ్వీ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

More Telugu News