: వ్యూహానికి పదును పెడుతున్న తెలుగుదేశం... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కీలక సమావేశం

తెలుగుదేశం పార్టీ నేతలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రత్యేక వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణలతో పాటు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. హోదా పేరు చెప్పకుండా ప్యాకేజీ ప్రకటిస్తే, దాని వల్ల రాష్ట్రానికి కలిగే లాభాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలన్న విషయమై ప్రధానంగా చర్చ సాగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో విపక్షాలతో పాటు పలువురి నుంచి వచ్చే విమర్శనాస్త్రాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయం కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి మంచి ప్యాకేజీ వచ్చి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక ఉంటే, ఆ విషయాలను వెంటనే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జ్ ల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ సిద్ధంగా ఉండాలని యనమల సూచించినట్టు సమాచారం.

More Telugu News