: ఏదీ ఉచితంగా లభించదు... పొందాలని చూస్తే పెను కష్టాలను ఆహ్వానించినట్టే: రాజన్ కీలక వ్యాఖ్య

ఆర్థిక శాస్త్రంలో ఏదీ ఉచితంగా లభించదని, అలా పొందాలని చూస్తే, భవిష్యత్తులో పెను కష్టాలను ఆహ్వానించినట్టేనని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణకు రెండు రోజుల ముందు బ్యాంకులకు మూలధనం కల్పించే అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. క్యాపిటలైజేషన్, ప్రభుత్వ ఆస్తులపై వడ్డీ, మార్కెట్ పార్టిసిపెంట్స్ ద్వారా ఆర్బీఐకి ఆదాయం వస్తుందని గుర్తు చేసిన ఆయన, దాన్ని డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడమంటే, తిరిగి వ్యవస్థలోకి ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. అందువల్ల నిధి సృష్టి, కరెన్సీ ముద్రణ ఉండవని అన్నారు. కేంద్రానికి ఆర్బీఐ నుంచి డివిడెండ్ ఇస్తే, ఇతర అత్యవసర వ్యయాల కోసం కొత్తగా ఆర్బీఐ డబ్బులను ప్రింట్ చేయాల్సి వస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే పరిణామమని అన్నారు. ఉచితంగా డబ్బు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, శాశ్వత నిధులను పెంచుకునే అంశాలను ఆర్బీఐ ఎన్నడూ మరువదని తెలిపారు.

More Telugu News