: వాటర్ వృథా చేసిన ఫలితం.. ముగ్గురు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిపివేసిన ప్రభుత్వం

కరవుతో అల్లాడిపోతున్న సమయంలో లక్షల లీటర్ల నీటిని వృథా చేశారన్న ఆరోపణపై ముగ్గురు ఉద్యోగుల ఇంక్రిమెంట్లను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇంక్రిమెంట్లు కోల్పోయిన ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు క్లాస్ వన్ అధికారి. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 21న లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్(ఎల్ఎంసీ)కి చెందిన ఆరు నీటి ట్యాంకుల నుంచి ఓవర్ ఫ్లో కారణంగా 1.5 లక్షల లీటర్ల నీళ్లు వృథా అయ్యాయి. మోటార్లు ఆన్ చేసిన అధికారులు ట్యాంకులు నిండినా వాటిని ఆఫ్ చేయడం మర్చిపోయారు. దీంతో లక్షన్నర లీటర్ల నీళ్లు నేలపాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన ఎల్ఎంసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ పాండురంగ పోలె.. క్లాస్ వన్ అధికారితోపాటు మరో ఇద్దరు ఉద్యోగుల నిర్లక్ష్యమే నీళ్ల వృథాకు కారణమని తేల్చారు. వాటర్ వేస్టేజీని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అందుకు కారకులైన ముగ్గురు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిపివేసింది. కాగా కరవుతో అల్లాడిపోతున్న లాతూరు ఇటీవల ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

More Telugu News