: టర్కీలో బహిరంగ వివాహాలు, ఎంగేజ్మెంట్ వేడుకలపై నిషేధం!

టర్కీలో బహిరంగ వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించుకోవడంపై నిషేధం విధిస్తూ ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో జ‌రుగుతోన్న వివాహ వేడుక‌ల‌పై దాడులు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. వాటిని అరిక‌ట్ట‌డానికే ఆ దేశ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ చేసిన‌ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. వివాహాలు ఇండోర్‌లో జ‌రుపుకోవాల‌నుకున్నా దాని కోసం అధికారుల‌కు స‌మాచారం అందించాల్సి ఉంటుంది. దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు దాడులు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాయి. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను లెక్క‌చేయ‌కుండా వేడుక‌లు నిర్వ‌హిస్తే ట‌ర్కీలో అమలులో ఉన్న‌ దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించ‌నున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ దేశంలోని గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్లో ఆత్మాహుతి దాడి జ‌రగ‌డంతో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు. దీంతో ట‌ర్కీ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకుంటోంది.

More Telugu News