: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 38 మంది హైదరాబాదీలు!... రూ.2 వేల ఫైన్ నుంచి ఐదు రోజుల దాకా జైలు శిక్ష!

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాదు పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా... డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గడం లేదు. పదుల సంఖ్యలో మందుబాబులు ఫుల్లుగా మద్యం పట్టించి వాహనాలపై రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న నగరంలోని కాచిగూడ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరగగా... ఏకంగా 38 మంది పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి వారందరికీ శిక్షలు ఖరారు చేశారు. ఆయా వ్యక్తులకు సంబంధించి డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ నేరాల చిట్టా ఆధారంగా రూ.2 వేల జరిమానాతో మొదలైన ఈ శిక్షలు... ఏకంగా ఐదు రోజుల జైలు దాకా ఉన్నాయి. పట్టుబడ్డ మందుబాబుల్లో నలుగురికి రూ.2 వేల జరిమానా విధించిన న్యాయమూర్తి, సామాజిక సేవ చేయాలంటూ ఐదుగురికి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన 29 మందిలో 18 మందికి రెండు రోజులు, ముగ్గురికి మూడు రోజులు, ఏడుగురికి నాలుగు రోజులు, ఓ వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్షలు ఖరారయ్యాయి.

More Telugu News