: జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ‘తృణమూల్ కాంగ్రెస్’

‘తృణమూల్ కాంగ్రెస్’కు జాతీయ పార్టీ హోదా లభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ ధ్రువీకరణ ఇచ్చింది. దేశంలో 7వ జాతీయ పార్టీగా ‘తృణమూల్ కాంగ్రెస్’కు గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ తో పాటు త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. కాగా, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 1968లో రూపొందించిన మూడు నిబంధనలే ప్రామాణికం. ఈ మూడు నిబంధనల్లో ఏదో ఒక నిబంధనకు అర్హత సాధించాలి. ఇంతకీ ఆ మూడు నిబంధనలేమిటంటే... * 3 రాష్ట్రాల్లో కనీసం రెండు శాతం ఓటింగ్ తో 11 లోక్ సభ స్థానాలు సాధించాలి. * కనీసం 4 రాష్ట్రాల్లో ఆరు శాతం ఓటింగ్ తో నాలుగు లోక్ సభ స్థానాలు పొందాలి. * ఏదైనా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. వీటిలో చివరి నిబంధనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అర్హత సాధించడంతో ఆ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది.

More Telugu News