: సాటి ఖైదీల కోసం... 2000 మంది ఖైదీలు ఆరురోజులుగా నిరాహార దీక్ష

తోటి ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రా జైలులో 2000 మంది ఖైదీలు గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. 14 ఏళ్ల జైలు శిక్ష ముగిసిన వారందర్నీ విడుదల చేయాలని, అంతవరకు తాము నిరాహార దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తమను పరామర్శించాలని, ఆయనతో తమ గోడును వెళ్లబోసుకుంటామని వారు చెబుతున్నారు. ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న తమపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, కొందరిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

More Telugu News