: నువ్వు బతుకు, తమిళనాడును బతికించు: కర్ణాటకకు సుప్రీం కీలక సూచన

నదుల నీళ్లను వాడుకుంటూ బతకడమే కాకుండా, పొరుగు రాష్ట్రాలను బతికించేందుకు కూడా సహకరించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పొరుగున ఉన్న తమిళనాడు వాసులకు కూడా కొంత నీటిని వదలాలని సలహా ఇస్తూ, 'బతుకు... బతికించు' అని వ్యాఖ్యానించింది. ఏ మేరకు నీటిని తమిళనాడుకు ఇవ్వగలరో చెప్పాలని అడిగింది. రెండు రాష్ట్రాలూ నీటి వివాదాలను పెంచుకోరాదని ఆదేశించింది. దిగువకు నీటిని వదలకపోవడంతో నదిలోని మత్స్య సంపదను కోల్పోతున్నామని తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నదీజలాల ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నప్పటికీ నీటి విడుదల విషయంలో కర్ణాటక సర్కారు మొండి వైఖరితో ఉందని తమిళనాడు ఆరోపించింది. ఈ విషయంలో కోర్టులో వాదనలు జరుగగా, తమిళనాడు వాసులు బాధితులుగా మిగలకుండా చూసుకోవాలని కర్ణాటకకు సూచించింది.

More Telugu News