: మలేషియాలో విస్తరించిన జికా... తదుపరి టార్గెట్ ఇండియా లేదా చైనాయే!

ఆఫ్రికా దేశాలను వణికించి, ఆసియాలో కాలుమోపిన జికా వైరస్ ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉన్న చైనా, భారత్ లపై విరుచుకుపడనుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలేషియాలో క్షణక్షణానికీ విస్తరిస్తున్న జికా, తొలుత చైనా లేదా ఇండియాకు, ఆపై మిగతా ఆసియా దేశాలకు విస్తరించవచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు వ్యాఖ్యానించారు. మొత్తం 260 కోట్ల మంది జికా భయం గుప్పిట ఉన్నట్టేనని, చైనా, ఇండియాలతో పాటు ఫిలిప్పీన్స్, నైజీరియా, వియత్నాం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు జికా ముంగిట ఉన్నట్టేనని వివరించారు. కాగా, ఈ వైరస్ గర్బిణిలకు సోకితే, శిశువు మెదడు పనితీరు దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News