: ఏం కుటుంబాలివి? డబ్బుకోసం మహిళల శరీరాలను ఎందుకు అమ్ముకుంటారు?: సరోగసీ బిల్ పై జూనియర్ మినిస్టర్ అనుప్రియ

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద సరోగసీ బిల్లుపై ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ స్పందించారు. మహిళలకు మేలు చేకూర్చేందుకు ఎన్నో స్కీములను ప్రవేశపెట్టారని, వాటివల్ల లబ్ధిని పొందకుండా డబ్బుకోసం శరీరాలను ఎందుకు అమ్ముకుంటారని ఆమె ప్రశ్నించారు. "సులభంగా డబ్బు సంపాదించేందుకు మహిళలను వాడుకుంటున్నారు. ఏం కుటుంబాలివి?" అని మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన అనుప్రియ ప్రశ్నించారు. భారతదేశంలో ఎంత మంది మహిళలు తమకు ఇష్టపూర్వకంగా గర్భాన్ని అద్దెకు ఇస్తున్నారని కూడా ఆమె ప్రశ్నించారు. ఇల్లు గడవడం కోసం అద్దె గర్భాన్ని మోయడం శరీరాన్ని అమ్ముకోవడమేనని, దీన్ని నివారించాల్సిందేనని అన్నారు. కాగా, గత వారంలో వచ్చిన ఈ బిల్లు ప్రకారం, డబ్బిచ్చి అద్దె గర్భాన్ని కొనుక్కోరాదన్న సంగతి తెలిసిందే. కేవలం దగ్గరి బంధువర్గంలోని వారి నుంచి మాత్రమే గర్భాన్ని అద్దెకు పొందాల్సివుంటుంది. కొత్తగా పెళ్లయిన వారికి ఈ విధానంలో పిల్లల్ని పొందేందుకు అనుమతించారు. ప్రవాస భారతీయులు, విదేశీయులు, ఒంటరిగా ఉండేవాళ్లు, నపుంసకులు కూడా సరోగసీ విధానంలో ఇండియాలో పిల్లల్ని పొందడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది.

More Telugu News