: చంద్రబాబుపై జగన్ ఫైర్!...‘ఓటుకు నోటు’ నుంచి బయటపడేందుకే సుజనాను ఢిల్లీకి పంపారని ఆరోపణ!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో నివాళి అర్పించిన జగన్... అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారని జగన్ ఆరోపించారు. సదరు కేసు నుంచి బయటపడేందుకే సుజనా చౌదరిని చంద్రబాబు ఢిల్లీకి పంపారన్నారు. రెయిన్ గన్లపై చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్స్ అందుబాటులోకి వచ్చాయని జగన్ చెప్పారు. సీమ ప్రాజెక్టులకు శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు. రాయలసీమతో పాటు గోదావరి, కృష్ణా డెల్టాలు కరవుతో అల్లాడుతుంటే... ప్రత్యేక హోదాపై చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ విరుచుకుపడ్డారు.

More Telugu News