: ముఖేశ్ ‘డేటా గిరి’ ఎఫెక్ట్!... ధరల తగ్గింపునకు సెల్యూలార్ ఆపరేటర్ల సన్నాహాలు!

దేశీయ మొబైల్ రంగంలో నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త సంచలనానికి తెర తీసింది. ఉచిత కాల్స్ పేరిట ప్రవేశపెట్టిన ‘రిలయన్స్ జియో’ కేవలం డేటా చార్జీలను మాత్రమే వసూలు చేయనుంది. ఈ మేరకు నిన్న ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే... ఆ రంగంలోని ఇతర ఆపరేటర్ల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా రిలయన్స్ జియోను ఎదుర్కొని నిలబడాలంటే ఐడియా, ఎయిర్ టెల్ తదితర మొబైల్ సేవల సంస్థలు కూడా తమ టారిఫ్ లను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. వెరసి మొబైల్ సేవల రంగంలో విపరీతమైన పోటీకి తెర లేచింది. ఫలితంగా వినియోగదారుడికి మరింత చౌక ధరలకు మొబైల్ సేవలు అందనున్నాయి. ఈ దిశగా ధరలు తగ్గించే దిశగా సెల్యూలార్ ఆపరేటర్లు యుద్ధ ప్రాతిపదికన కసరత్తులు చేస్తున్నారు.

More Telugu News