: సమ్మె ఎపెక్ట్!... విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణిల్లో నిలిచిపోయిన ఉత్పత్తి!

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న అర్ధరాత్రి నుంచే మొదలైన సార్వత్రిక సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా పడింది. సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన సమ్మె తెల్లవారేసరికి తన ప్రభావం చూపింది. ఏపీలోని విశాఖలోని స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీ, పోర్టులకు చెందిన కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీల్లో ఉత్పత్తి నిలిచిపోగా, పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన సింగరేణి కాలరీస్ కు కూడా సమ్మె దెబ్బ తగిలింది. సింగరేణిలోని భూపాలపల్లి డివిజన్ కు చెందిన 4 వేల మంది కార్మికులు సమ్మెకు జైకొట్టారు. వెరసి అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

More Telugu News