: భారత్ బంద్ షురూ!... అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కిన కార్మిక సంఘాల నేతలు!

బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా ప్రధాన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిన్న అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. దాదాపుగా దేశంలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఈ బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి నుంచే రోడ్లపైకి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బంద్ అమల్లోకి వచ్చినట్లైంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. బ్యాంకుల సిబ్బంది కూడా బంద్ లో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు అన్ని బ్యాంకుల శాఖలు మూతపడనున్నాయి. విద్యాలయాలను కూడా మూసివేసేందుకు కార్మిక సంఘాల నేతలు యత్నించే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నేటి తెల్లవారుజాముకే ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ముందు కార్మిక సంఘాల నేతలు బైఠాయించారు. వెరసి ఇప్పటిదాకా ఒక్క బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు.

More Telugu News