: 'యాపిల్' ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది... ఐర్లాండ్ తో కలిసి పోరాడుతా: సంస్థ సీఈవో టిమ్ కుక్

యాపిల్ కంపెనీని యూరోపియన్ యూనియన్ లక్ష్యం చేసుకున్నట్టు అనిపిస్తోందని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీలపై వ్యతిరేకత సెంటిమెంటు వల్ల తమపై యూరోపియన్ యూనియన్ ఇంత భారీమొత్తంలో (లక్ష కోట్ల రూపాయలు) జరిమానా విధించి ఉంటుందని అన్నారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేసిన ఆయన, ఐర్లాండ్ తో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. ఐర్లాండ్‌ ను గురిపెట్టడంలో భాగంగా యాపిల్ ను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదని కుక్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా వ్యతిరేక భావజాలం ఈ తీర్పునకు కారణం కావొచ్చునని ఆయన అన్నారు. కాగా, ఐర్లాండ్‌ చేసుకున్న పన్నుమినహాయింపు ఒప్పందాలను సాకుగా పెట్టుకొని యూరప్‌లో తన ఉత్పత్తుల అమ్మకాలపై యాపిల్‌ పన్ను ఎగ్గొడుతున్నదని, ఇందుకు దాదాపు లక్ష కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని యూరోపియన్‌ కమిషన్‌ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News