: 70 శాతం మంది బాంబే ఐఐటీ విద్యార్థులు రోజూ స్నానం చేయట్లేదట!.. సర్వేలో బయటపడిన విస్తుగొలిపే విషయాలు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-బీ) బాంబే విద్యార్థుల్లో 70 శాతం మంది తరచూ స్నానం చేయడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రతీ పదిమందిలో ఆరుగురు రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్నారట. ఇక పదిశాతం మంది విద్యార్థులైతే వారానికి ఒకసారి స్నానం చేస్తుండగా 30 శాతం మంది మాత్రం రోజూ స్నానం చేస్తున్నట్టు విద్యార్థులు నిర్వహించిన సీనియర్ సర్వే తేల్చింది. అండర్ గ్రాడ్యుయేట్లు, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు, ఎంఎస్సీ, ఎంటెక్ గ్రాడ్యుయేట్లు అయిన 332 మందిపై సర్వే నిర్వహించగా విస్మయ పరిచే ఈ నిజాలు బయటకు వచ్చినట్టు సర్వే పేర్కొంది. ఇనిస్టిట్యూట్‌లోని మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మంది స్నేహితులతో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపిస్తుండగా 27 శాతం మంది ఇంటికి వెళ్లిపోవాలని భావిస్తున్నారట. 19 శాతం మంది ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుండగా 66 శాతం మందిమాత్రం చదువు ముగిసి ఇంటికి వెళ్లాక కూడా స్నేహం కొనసాగించాలని భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.

More Telugu News