: రేపిస్ట్ లు, టెర్రరిస్టులకు పెరోల్ ఇవ్వం!... కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు!

అత్యాచారాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై మహారాష్ట్ర సర్కారు కొరడా ఝుళిపించింది. ఈ రెండు రకాల నేరాలకు పాల్పడే వారికి ఇకపై పెరోల్ ఇవ్వబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ‘ప్రిజన్స్ రూల్స్’కు కీలక సవరణలు చేసింది. అత్యాచారాలు, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు ఘోర నేరాలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు తీర్మానించింది. ఇక ఇతర నేరాలకు పాల్పడే వారికి ప్రస్తుతం లభిస్తున్న 90 రోజుల పెరోల్ ను సగానికి సగం తగ్గించేసిన ప్రభుత్వం... పెరోల్ పరిమితిని 45 రోజులకు కుదించేసింది.

More Telugu News