: 160 టన్నుల టమాటాలను గుమ్మరిస్తే... వాటితో కొట్టుకుని పండగ చేసుకున్నారు!

స్పెయిన్ లో 'టమాటా ఫైట్ ఫియస్టా' వేడుక ఘనంగా జరిగింది. సుమారు 20 మంది ఔత్సాహికులు ఈ వేడుకలో పాలుపంచుకోవడం విశేషం. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పండుగల్లో 'టమాటా ఫైట్ ఫియస్టా' ఒకటి. స్పెయిన్ లోని వాలెన్సియాకు 50 కిలోమీటర్ల దూరంలోని బర్నోల్ లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా 160 టన్నుల టమాటాలను ట్రక్కులతో తీసుకొచ్చి వీధుల్లో గుమ్మరించారు. దీంతో ఈ పండగలో పాలుపంచుకున్న 20 వేల మంది ఔత్సాహికులు ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకుంటూ, వాటిపై పడి దొర్లుతూ పండగను వేడుకగా నిర్వహించుకున్నారు. బర్నోల్ లో ప్రతి ఏడాది ఆగస్టు చివరి బుధవారం ఈ పండగ జరుగుతుంది. దీంతో ఈ ఉత్సవానికి భారీ ఎత్తున పర్యాటకులు హాజరవుతున్నారు. టమోటాలు, వాటి రసంతో బర్నోల్ వీధులన్నీ ఎరుపెక్కాయి.

More Telugu News