: 400 ఏళ్ల తర్వాత తెరచుకున్న హుస్సేన్ సాగర్ తూములు

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరి, ప్రమాదకర స్థితికి రాగా, గేట్లను ఎత్తివేసి నీటిని మూసీ నదిలోకి వదిలారు. 400 ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్ తూములు తెరవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా, 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పరిపాలనా కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మించారు. అయితే, దీని నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరింటెండెంట్ అయిన హుస్సేన్ షా వలీ తీసుకున్నాడు. 24 చదరపు కిలోమీటర్లు, 32 అడుగుల లోతుతో దీనిని తవ్వారు. దీని తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవడంతో దీనిని మూసీ నదికి అనుసంధానం చేశారు. మొదట ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలనుకున్నారు. కానీ, హుస్సేన్ వలి ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందటంతో ఆయన పేరుతోనే హుస్సేన్ సాగర్ అని పిలవటం ప్రారంభించారు.

More Telugu News