: గడచిన 8 నెలల్లో రూ. 4 వేల కోట్లు నష్టపోయిన వాహన పరిశ్రమ

ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ ప్రాంతాల్లో 2000 సీసీ ఇంజన్ కెపాసిటీ దాటిన డీజిల్ వాహనాల అమ్మకాలను నిలిపివేయడం ద్వారా గడచిన 8 నెలల కాలంలో భారత వాహన పరిశ్రమ రూ. 4 వేల కోట్లను నష్టపోయిందని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) వెల్లడించింది. ఈ ఉదయం జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎక్మా) 58వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి, డీజెల్ వాహనాలు విడుదల చేసే కాలుష్యాలపై కోర్టులకు సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనందునే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు, ఢిల్లీలో కాలుష్యం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో డీజెల్ వాహనాలపై నిషేధం అమలైందని, ఆపై కాలుష్యానికి డీజెల్ వాహనాలు మాత్రమే కారణం కాదని తెలుసుకుని ఒక శాతం అదనపు పన్నుతో అమ్మకాలు కొనసాగించేందుకు కోర్టులు సమ్మతించాయని ఆయన గుర్తు చేశారు. కాలుష్యానికి నిజమైన కారణాలను వెతకకుండా వాహన పరిశ్రమను బలిచేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు.

More Telugu News