: ఈ సైకిలు బరువెంతో తెలుసా?..940 కిలోలు!

మాములుగా సైకిలంటే చేతితో లేపుకెళ్లేంత బరువుంటుంది. చిన్నారులు సైతం దానిని అమాంతం ఎత్తుకెళ్లగలరు. కానీ జర్మనీకి చెందిన ఫ్రాంక్ డోస్ తయారుచేసిన సైకిలు గురించి వింటే ముక్కున వేలేసుకోకమానరు. ఎందుకంటే, ఇది కారు కంటే బరువైనది కాబట్టి! దీని బరువు ఏకంగా 940 కిలోలు. ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిలుగా ఇది రికార్డులకు ఎక్కనుంది. భారీ వాహనాల టైర్లు, పాత ఇనుప సామాన్లతో దీనిని తయారుచేశాడు. విశేషం ఏమిటంటే, ఇంత బరువున్నా దీనిని సాధారణ సైకిలు లానే తొక్కుకుంటూ పోవచ్చట. ఇంత బరువున్నా డోస్ మాత్రం సంతృప్తి చెందడం లేదు. దీని బరువును 12 వందల కేజీలకు తీసుకెళ్తానని చెబుతున్నాడు. శనివారం ఈ భారీ సైకిల్‌పై 200 మీటర్ల దూరం ప్రయాణించిన డోస్ సైకిల్ తయారీని మార్చిలో మొదలుపెట్టినట్టు చెప్పాడు. సైకిలుకు ఐదడుగల వ్యాసం ఉన్న టైర్లు అమర్చాడు. కాగా గతంలో 860 కిలోలు ఉన్న ఓ సైకిలు గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. ఆ రికార్డును ఇది తిరగరాయనుంది.

More Telugu News