: తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలకు కళ్లెం... అలాంటి ప్రచారకర్తలు ఇకపై జైలుకే!

'ఈ ఫేస్ క్రీమ్ వాడండి తెల్లగా అవుతారు, ఇది తాగండి బలమొచ్చేస్తుంది, ఆ సెంటు పూసుకుంటే అమ్మాయిలంతా మీ వెంటే...' అంటూ ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇకపై జైలుకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి చట్టం తయారవుతోంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టసవరణ ముసాయిదాపై కేంద్ర మంత్రుల బృందం నేడు చర్చించనుంది. అనంతరం దీనిని కేబినెట్ ఆమోదిస్తే ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రూపొందించిన చట్టానికి మెరుగులు దిద్దినట్టవుతుంది. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖుల ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి ఆ సెలబ్రిటీకి 10 లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఇదే నేరం సదరు సెలబ్రిటీ రెండోసారి, ఆపైన మరోసారి చేస్తే కనుక 50 లక్షల రూపాయల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ ముసాయిదాలో కొత్త నిబంధన చేర్చినట్లు తెలుస్తోంది. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షతో పాటు, లెసైన్స్ రద్దు చేయనున్నారు. ఈ బిల్లును 2015లో ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ప్రవేశపెట్టగా, దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏప్రిల్‌ లో తన సిఫారసులను సమర్పించింది. దీంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

More Telugu News