: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌గాంధీలకు మరోసారి చుక్కెదురు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో ఈరోజు వారిరువురికీ ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక నిధుల దుర్వినియోగం అంశంలో కాంగ్రెస్ నేతలపై పిటిషన్‌ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఆయ‌న మ‌రోసారి స్పందిస్తూ.. కేసులో సంబంధిత పత్రాలను కాంగ్రెస్‌ పార్టీ రెండు వారాల్లోగా న్యాయ‌స్థానం ముందు ఉంచాల‌ని మ‌రో పిటిష‌న్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును అక్టోబర్‌ 2కు వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీల‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు మోతిలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, సుమన్‌ దుబే, శామ్‌ పిట్రోడా, యూత్‌ ఇండియన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కొన్ని నెల‌ల క్రిత‌మే కేసు వేశారు.

More Telugu News