: పాక్ లోనే దావూద్ ఉన్నాడని స్పష్టం చేసిన ఐరాస... వెంటనే అప్పగించాలని భారత్ డిమాండ్

ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, పాక్ లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంను వెంటనే భారత్ కు అప్పగించాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఆయన పాక్ లోనే ఉన్నాడంటూ ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న సలహాలు, సూచనలను పాక్ పాటిస్తుందనే భావిస్తున్నట్టు తెలిపారు. భారత్ అందించిన దావూద్ చిరునామా, అతని భార్య, తండ్రి, పలువురు బంధువుల పేర్లను ఐరాసకు అప్పగించగా, అధికారులు వీటిని పరిశీలించి దావూద్ ఆనుపానులు నిజమేనని తేల్చారు. పాక్ లోనే ఆయన ఉన్నాడని, అక్కడ ఆస్తులను కూడబెట్టాడని కూడా ఐరాస కమిటీ స్పష్టం చేసింది.

More Telugu News