: రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారిని తొలగిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు: ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా

ఇన్ఫోసిస్ సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి ఉద్యోగాన్ని వీడి వెళుతున్న వారినే తాము తొలగిస్తున్నామన్న ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. పలువురు మార్కెట్ అనలిస్టులతో సమావేశమైన సిక్కా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ప్రాజెక్టు రద్దు తమ సంస్థపై ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ లో అట్రిషన్ ను తగ్గించేందుకు తామెన్నో చర్యలు తీసుకున్నామని, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇన్ఫీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయటి సంస్థల్లో మంచి డిమాండ్` ఉన్నందునే రాజీనామాలు చేసి వీడుతున్న వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉందని అన్నారు. కాగా, ఇన్ఫీలో గత సంవత్సరం 17.3 శాతంగా ఉన్న రాజీనామాలు చేసిన వారి సంఖ్య ఈ ఏడు 20 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తరువాత, గడచిన జూలైలో ఉద్యోగులకు ఈఎస్ఓపీ (ఎంప్లాయి స్టాక్ ఆప్షన్)ను ప్రకటించిన ఇన్ఫోసిస్, ఎంపిక చేసిన ఉద్యోగులకు వాటాలను ప్రకటించింది.

More Telugu News