: ఇది మహిళల విజయం.. ముంబయి హజి అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేసిన బాంబే హైకోర్టు

లింగ‌భేదాన్ని ఖండిస్తూ భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఇటీవ‌లే దేశంలో మ‌హిళ‌ల‌కు అనుమ‌తిలేని ప‌లు ఆల‌యాల్లోకి ప్ర‌వేశించి పూజ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆమె చేస్తోన్న‌ ఉద్యమ ఫ‌లితంగా ఇప్పటికే ప‌లు దేవాల‌యాల్లోకి మ‌హిళ‌లు ప్రవేశించారు. ఈ క్ర‌మంలోనే ముంబయిలోని ప్ర‌సిద్ధ‌ హజి అలి దర్గాలోనికి మ‌హిళ‌ల‌ను అనుమ‌తిస్తూ బాంబే హైకోర్టు ఈరోజు చారిత్రాత్మ‌క‌ తీర్పునిచ్చింది. దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్న‌ట్లు న్యాయ‌స్థానం తెలిపింది. తృప్తి దేశాయ్ హాజీ అలీ దర్గాను సందర్శిస్తే ఆమెను చెప్పులతో కొడ‌తామ‌ని కొన్ని రోజుల క్రితం ప‌లువురు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ద‌ర్గాలోకి మ‌హిళ‌ల ప్రవేశం దృష్ట్యా వారికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా కోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News