: ‘స్కార్పేన్’ డాక్యుమెంట్లు లీకవలేదు.. ఉద్యోగే దొంగిలించాడు: ఫ్రెంచ్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కార్పేన్ జలాంతర్గాముల డాక్యుమెంట్ల లీకేజీ వ్యవహారం కొత్తమలుపు తీసుకుంది. ఆ డాక్యుమెంట్లు లీక్ కాలేదని, వాటిని ఫ్రెంచ్ ఉద్యోగే ఒకరు దొంగిలించారని ఫ్రెంచ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. డీసీఎన్ఎస్ నిర్మిస్తున్న అత్యాధునిక జలాంతర్గాములకు చెందిన అంత్యంత విశ్వసనీయ సమాచారం లీకైందంటూ ఆస్ట్రేలియన్ పత్రిక తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన లీకేజీ పత్రాలను కూడా ప్రచురించింది. ఈ కథనంపై దర్యాప్తు ప్రారంభించిన భారత్, ఫ్రెంచ్ అధికారులు పత్రాలు లీక్ కాలేదని, గతంలో ఉద్యోగం నుంచి తొలగించిన ఓ ఫ్రెంచ్ అధికారి వాటిని దొంగిలించాడని పేర్కొన్నారు. 2011 ప్రాంతంలో అవి చోరీకి గురైనట్టు తెలిపారు. ఆ పత్రాలు అంత ముఖ్యమైనవేమీ కావని, అందులో సబ్‌మెరైన్ ఆపరేషనల్ విషయాలు తప్ప మరే అంశాలు లేవని వివరించారు.

More Telugu News