: ఇకపై పోలీస్ విచారణ లేకుండానే పాస్ పోర్టు

ఇకపై పాస్ పోర్టు నిమిత్తం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాన్ కార్డుతో పాటు ఫారం అనెక్సర్-ఐ కూడా అదనంగా సమర్పిస్తే, ఎటువంటి పీవీఆర్ (పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు) లేకుండానే పాస్ పోర్టు జారీ కానుంది. ఈ మేరకు గతంలోనే కేంద్రం నిర్ణయాలు వెలువడగా, ఇప్పుడవి ఆచరణలోకి వచ్చాయి. సాధారణ పాస్ పోర్టు విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని విశాఖపట్నం పాస్ పోర్టు కేంద్రం అధికారి ఎన్ఎల్పీ చౌదరి వెల్లడించారు. దరఖాస్తుదారు సమర్పించే పత్రాలను ఆన్ లైన్ లో పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని, పీవీఆర్ లేకుండా పాస్ పోర్టు అందించేందుకు ఎలాంటి అదనపు రుసుములనూ వసూలు చేయబోమని ఆయన అన్నారు.

More Telugu News