: తూతూ మంత్రపు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు?: వైకాపా

వచ్చే నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగైదు రోజులు సాగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించిన వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. కనీసం మూడు లేదా నాలుగు వారాల పాటు జరపాల్సిన వర్షాకాల సమావేశాలను తూతూ మంత్రంగా జరపాలని చూస్తున్నారని, అంతమాత్రానికి అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీలు వంటి ఎన్నో కీలకాంశాలు పెండింగులో ఉండగా, వాటన్నింటినీ పక్కనపెట్టి, కేవలం వస్తు సేవల పన్ను బిల్లుకు ఆమోదం పలికేందుకే సమావేశాలు నిర్వహించాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. వీలైనన్ని అధిక రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

More Telugu News