: నరేంద్ర మోదీతో కలసి పనిచేస్తారా? అయితే దరఖాస్తు చేయండిలా!

మీకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పనిచేయాలని ఉందా? ఆయన ప్రారంభించిన 'డిజిటల్ ఇండియా - మై గౌ'లో ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని కేంద్ర మంత్రివర్గ విభాగాల్లో నిపుణులైన యువత నుంచి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎడిటోరియల్ రైటర్లు, రీసెర్చర్లు, సాఫ్ట్ వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, గ్రాఫిక్ డిజైన్లర్లు, స్క్రిప్ట్ రైటర్లు, యాప్ డెవలపర్లు... ఇలా ఎన్నో రకాల పోస్టులు, వివిధ సీనియారిటీ స్థాయుల్లో అందుబాటులో ఉన్నాయి. మీ రెజ్యూములను పీడీఎఫ్ ఫార్మాట్ లో ఒక పేజీలో తయారు చేసి పంపడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఏ పోస్టును కోరుకుంటున్నారో తెలుపుతూ రెజ్యూమ్ ను అప్ లోడ్ చేయాలి. ఉదాహరణకు అకడమిక్ ఎక్స్ పర్ట్ పోస్టుకు దరఖాస్తు చేస్తుంటే, కామెంట్ బాక్స్ లో 'హ్యాష్ టాగ్ అకడమిక్ ఎక్స్ పర్ట్' ( #AcademicExpert) అని టైప్ చేసి రెజ్యూమ్ అప్ లోడ్ చేయాలి. వీటిని 'మైగౌ' అధికారుల బృందం షార్ట్ లిస్ట్ చేసి డిస్కషన్ / ఇంటర్వ్యూల తరువాత, వేతన ప్యాకేజీని ప్రత్యక్షంగా మాట్లాడి నిర్ణయిస్తారు. దరఖాస్తులను "https://www.mygov.in/task/do-you-want-work-government/"లో పంపవచ్చు. అంతకన్నా ముందు సైట్ లో రిజిస్టర్ కావాల్సి వుంటుంది. ఇప్పటివరకూ 154 మంది దరఖాస్తు చేయగా, ఒక్కరిని కూడా అప్రూవ్ చేయలేదని, అన్ని దరఖాస్తులూ పరిశీలనలోనే ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News