: అన్ని మునిసిపల్ స్కూళ్లలో సూర్యనమస్కారాన్ని తప్పని సరిచేసిన బీఎంసీ.. వ్యతిరేకిస్తున్న ముస్లింలు

మునిసిపల్ స్కూళ్లలో సూర్యనమస్కారాన్ని తప్పనిసరి చేస్తూ బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై ముస్లిం సంఘాలు విరుచుకుపడుతున్నాయి. వారం రోజుల్లోగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే కోర్టుకెళతామని హెచ్చరిస్తున్నాయి. సూర్య నమస్కారం అనేది హిందూ పూజలో ఒక భాగమని, ఇది ఇస్లాంకు పూర్తి విరుద్ధమని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ పేర్కొంది. దీనిని అన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయడం తగదని సూచించింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ నేత రైస్ షేక్‌ను కలిసి బీఎంసీ నిర్ణయంపై చర్చించింది. ఈ సందర్భంగా షేక్ మాట్లాడుతూ త్వరలోనే బీఎంసీని కలిసి ఈ ప్రతిపాదనను వారం రోజుల్లో వెనక్కి తీసుకోవాలని కోరతానన్నారు. అదే కనుక జరగకుంటే కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా అన్ని స్కూళ్లలో యోగా, సూర్యనమస్కారాలను తప్పనిసరి చేస్తూ మంగళవారం బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

More Telugu News