: టాప్ 10 ధనిక దేశాల్లో భారత్ కు చోటు!... 5,600 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఇండియా!

అన్ని రంగాలలోను వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... తాజాగా టాప్ 10 ధనిక దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ‘న్యూ వెల్త్ వరల్డ్’ నివేదిక ప్రకారం మొత్తం 5,600 బిలియన్ డాలర్లతో బారత్... ధనిక దేశాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. అమెరికా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఈ జాబితాలో... ధనిక దేశాలుగా పేరుగాంచిన కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీలను భారత్ వెనక్కు నెట్టేసింది. జాబితాలో ఈ మూడు దేశాలు భారత్ తర్వాత వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. ఇక జనాభాలో భారత్ కంటే ముందున్న చైనా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో నిలిచిన దేశాలు, వాటి నెట్ వర్త్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. 1. అమెరికా... 48,900 బిలియన్ డాలర్లు 2. చైనా... 17,400 బిలియన్ డాలర్లు 3. జపాన్... 15,100 బిలియన్ డాలర్లు 4. బ్రిటన్... 9,200 బిలియన్ డాలర్లు 5. జర్మనీ... 9,100 బిలియన్ డాలర్లు 6. ఫ్రాన్స్... 6,600 బిలియన్ డాలర్లు 7. భారత్... 5,600 బిలియన్ డాలర్లు 8. కెనడా... 4,700 బిలియన్ డాలర్లు 9. ఆస్ట్రేలియా... 4,500 బిలియన్ డాలర్లు 10. ఇటలీ... 4,400 బిలియన్ డాలర్లు

More Telugu News