: రత్నాలమ్మ అమ్మవారి మొక్కు తీర్చుకోనున్న సింధు

రియో ఒలింపిక్స్ లో భారత పతాకం రెపరెపలాడేలా చేసి, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన సిల్వర్ మెడల్ విజేత, ప్రముఖ షట్లర్ పీవీ సింధు తమ కులదైవాన్ని త్వరలోనే దర్శించనున్నట్లు తెలుస్తోంది. సింధు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 19 కిలోమీటర్ల దూరంలోని పెదవేగి మండలంలో రత్నాలమ్మ కుంట గ్రామం ఉంది. సింధు కుటుంబ దైవమైన రత్నాలమ్మ అమ్మవారు అక్కడ కొలువు దీరి ఉంది. త్వరలో అమ్మవారిని దర్శించుకుని, తమ మొక్కులు తీర్చుకుంటామని సింధు బంధువు ఒకరు చెప్పారు. ఏ టోర్నమెంట్ లో నైనా పాల్గొనబోయే ముందు, వారి కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ నిర్వహించే ముందు రత్నాలమ్మ అమ్మవారిని సింధు కుటుంబం దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోందని ఆమె సన్నిహితులు చెప్పారు.

More Telugu News