: అక్కను చూడగానే ఒక్కసారిగా జీపులో నుంచి బయటకు గెంతిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్

రియో ఒలింపిక్స్ లో పతకం దక్కించుకోలేక పోయినప్పటికీ, తన అత్యద్భుత ప్రతిభను చాటిన త్రిపుర అమ్మాయి, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఈరోజు త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకుంది. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి సుమారు 12 కిలోమీటర్ల ఓపెన్ టాప్ జీపులో ఆమెను ఊరేగిస్తూ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. ఆమెతో పాటు కోచ్ బిశ్వేశ్వర్ నంది కూడా ఉన్నారు. వేలాది అభిమానులు ఆమె వెంట తరలివెళ్లారు. అక్కడి మైదానంలో దీపా కర్మాకర్ ను త్రిపుర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అయితే, దీపకు స్వాగతం పలుకుతున్న అభిమానులలో ఆమె అక్కయ్య కూడా ఉంది. దీప తన అక్కను చూడగానే ఒక్కసారిగా జీపులో నుంచి బయటకు గెంతి, ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణి దీప. ఫైనల్ మ్యాచ్ లో స్వల్ప పాయింట్లతో ఓటమిపాలై, 4వ స్థానంలో నిలిచింది.

More Telugu News