: ఒలింపిక్స్‌కు రెండు నెల‌ల ముందు నుంచే కష్టపడ్డాను!: గోపిచంద్ అకాడమీలో సింధు

ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధు హైద‌రాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీకి చేరుకుంది. అక్క‌డ ఆమెకు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడింది. ప‌త‌కం సాధించినందుకు త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని తెలిపింది. ఒలింపిక్స్ లో గెల‌వాల‌న్న త‌న‌ క‌ల సాకార‌మైందని పేర్కొంది. త‌న స్వ‌ప్నం నెర‌వేర‌డానికి త‌న కోచ్‌, త‌ల్లిదండ్రులే కార‌ణ‌మ‌ని సింధు చెప్పింది. టైటిల్ పోరు ముగిసిన అనంత‌రం స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్‌ను తాను అభినందించిన‌ట్లు తెలిపింది. ఒలింపిక్స్‌కు రెండు నెల‌ల ముందు నుంచే క‌ష్ట‌పడిన‌ట్లు సింధు పేర్కొంది. మెరుగైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌ణాళిక రూపొందించుకొని సాధ‌న‌ చేసిన‌ట్లు తెలిపింది. తనకు కోచ్ మ‌ద్ద‌తు ఎంతో ఉందని పేర్కొంది. క్రీడ‌ల్లో మ‌హిళ‌ల‌కు త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తు చాలా అవ‌స‌రమ‌ని చెప్పింది.

More Telugu News