: ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ను ఎందుకు కొరుకుతారంటే...!

ఒలింపిక్స్ విజేతలు తమ మెడలోని మెడల్స్ ను కొరుకుతూ, చిరునవ్వులు చిందిస్తూ కనపడిన దృశ్యాలు కోకోల్లలు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులైతే తప్పనిసరిగా ఈ పోజ్ లో కనపడతారు. స్మిమ్మింగ్ రికార్డు బ్రేకర్ మైఖేల్ ఫెల్ప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్... ఇలా స్వర్ణ పతక విజేతలు ఈ విధంగా తమ మెడల్స్ ను కొరికినవారే. వాటిని ఎందుకు కొరుకుతారనే అనుమానం అభిమానులకు రాక మానదు. క్రీడా విజేతలు ఆ విధంగా చేయడానికి కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికి గాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ చెప్పిన దాని ప్రకారం, పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజ్ లివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్ ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News