: ఇండియాలో టోరెంట్ తో పాటు నిషేధిత సైట్లు వాడితే మూడేళ్ల జైలు, రూ. 3 లక్షల జరిమానా

ఇండియాలో నిషేధానికి గురైన వెబ్ సైట్లను చూసినా, టోరెంట్ తరహా వెబ్ సైట్ల నుంచి పైరేటెడ్ కంటెంట్ ను డౌన్ లోడ్ చేసినా ఇకపై మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3 లక్షల రూపాయల వరకూ జరిమానా పడనుంది. గత సంవత్సరం ఆగస్టులో 857 పోర్న్ సైట్లను, ఆపై 170 అభ్యంతరకర దృశ్యాలున్న సైట్లు, పైరసీ కంటెంట్ ఉన్న సైట్లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఇవన్నీ ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూ ఉండటంతో కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ, 1957 నాటి కాపీరైట్ చట్టం సెక్షన్లు 63, 63-ఏ, 65, 65-ఏలను సవరిస్తూ, భారీ శిక్ష, జరిమానాలను ఖరారు చేసింది. ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు)ల సాయంతో ఈ వెబ్ సైట్లకు అప్ లోడ్ చేసే వారిని, డౌన్ లోడ్ చేసేవారిని గుర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆప్ లోడ్ లేదా డౌన్ లోడ్ చేసిన 48 గంటల్లోనే వారిని గుర్తించి ప్రాసిక్యూట్ చేస్తామని వివరించాయి.

More Telugu News