: కృష్ణ నీరు కలుషితమైందని స్పెషల్ ఆఫీసర్ నివేదిక... వెంటనే కదిలిన చంద్రబాబు

కృష్ణా జిల్లా యనమలకుదురు వద్ద నదిలో నీరు అత్యంత కలుషితమైందని నివేదిక ఇస్తూ, ఘాట్ వద్ద నీటి పరిస్థితిపై ఫోటోలు తీసిన ప్రత్యేక అధికారి రాజశేఖర్ దానిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న సూయేజ్ ప్లాంటు నుంచి పెద్ద ఎత్తున మురుగు నీరు వచ్చి చేరుతోందని, నదిలో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని ఆయన తెలిపారు. ఈ నీటిలో స్నానం చేస్తే, పుణ్యం పక్కన బెడితే, రోగాలు రావడం ఖాయమని అన్నారు. రాజశేఖర్ పంపిన ఫోటోలపై వెంటనే స్పందించిన సీఎం, విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీర పాండియన్ ను ఘాట్ వద్ద పరిశీలనకు పంపారు. ఆయన నీటిని పరిశీలించి, వెంటనే అధికారులను రంగంలోకి దించగా, జేసీబీలను తెచ్చిన అధికారులు చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు.

More Telugu News