: ఆదిలాబాద్ ను విభజించినప్పుడు హైదరాబాదును ఎందుకు విభజించడం లేదు?: మల్లు భట్టివిక్రమార్క

తెలంగాణలో జిల్లాల విభజన సహేతుకంగా జరగడం లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోనే తక్కువ జనాభా కలిగిన ఆదిలాబాద్ జిల్లాను విభజిస్తున్నప్పుడు 44 లక్షల జనాభా కలిగిన హైదరాబాదును ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. జిల్లాల విభజన ఎవరి ఒత్తిళ్లకు, ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతోందని ఆయన నిలదీశారు. జిల్లాల విభజన 1974 చట్టం ప్రకారం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విభజన సహేతుకంగా లేదని ఆయన తెలిపారు. కొన్ని జిల్లాలు జిల్లా కేంద్రానికి బాగా దగ్గర్లోనే ఉన్నాయని, దీంతో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని స్పష్టమవుతోందని ఆయన తెలిపారు.

More Telugu News