: రజతంతో సరిపెట్టుకున్న సింధు...అద్భుతంగా ఆడిన మారిన్

వరల్డ్ నెంబర్ వన్ కరొలినా మారిన్ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించింది. తొలి సెట్ ను గెలుచుకున్న సింధుపై తదుపరి సెట్లలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి మారిన్ అద్భుతమైన పోరాటం చూపింది. సుమారు గంటర్నర పాటు సాగిన ఈ మ్యాచ్ లో కరొలినా మారిన్ తన సాధికారిక ఆటతీరుతో రెండు, మూడు సెట్లను గెలుచుకుని సింధును ఓడించింది. తొలి సెట్ లో ఆడిన దూకుడును తదుపరి సెట్లలో ప్రదర్శించడంలో సింధు విఫలమైంది. దీంతో మారిన్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేతగా నిలిచింది. సింధు రజత పతక విజేతగా నిలిచింది. సింధు ఓటమిపాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. అలాగే కోర్టు మొత్తం కలియదిరుగుతూ మారిన్ కొట్టిన షాట్లు ఆటగాళ్లందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, ర్యాలీ, డ్రాప్, స్మాష్.. ఇలా ప్రతి అంశంలోనూ సింధు కంటే మారిన్ అద్భుత ప్రతిభ కనబరిచింది. దీంతో ఆమె స్వర్ణవిజేత అయింది. అయితే వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణితో 11వ ర్యాంకు క్రీడాకారిణి తలపడినట్టుగా కాకుండా, టాప్ సీడ్ ఆడుతున్నట్టుగానే సింధు ఆడింది.

More Telugu News