: 'ఎంసెట్-2' లీకేజీ వ్యవహారంలో కొత్త మలుపు...బ్రోకర్ తో బేరసారాలాడిన డీఎస్పీ

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో మరో దారుణం వెలుగు చూసించింది. పేపర్ లీకేజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు విజయవాడలో ఉన్న నిందితుడి బాధ్యతలను మహబూబాబాద్ డీఎస్పీ బాలు జాదవ్ కు అప్పగించారు. దీనిని అవకాశంగా తీసుకున్న బాలు జాదవ్ విజయవాడలో ఉన్న ఆ బ్రోకర్ వద్దకు వెళ్లి, అతనిని అరెస్టు చేసేందుకు వచ్చామని తెలిపారు. అతని అరెస్టును నిర్ధారిస్తూ అతనికి నకిలీ అరెస్టు పత్రాలు చూపించారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే ఉన్నపళంగా 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో బెంబేలెత్తిపోయిన నిందితుడు అప్పటికప్పుడు లక్షన్నర ఇచ్చేందుకు, మరికొన్ని రోజుల్లో మిగిలిన లక్షన్నర ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అప్పటికప్పుడు ఆయనను ఓ ఏటీఎంకు తీసుకువెళ్లి లక్షన్నర రూపాయలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు, ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంకు నుంచి వీడియో పుటేజ్ ను సేకరించారు. దీంతో అతనిపై చర్యలకు సిద్ధమవుతోంది.

More Telugu News